మాడుగుల నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి స్థానిక ఎమ్మెల్యే బందర్ సత్యనారాయణమూర్తి మంగళవారం సాయంత్రం నియోజకవర్గ ప్రణాళిక కార్యాలయంలో కసరత్తు ప్రారంభించారు. ఈనెల తొమ్మిదో తేదీన ఈ కార్యాలయం ప్రారంభించగా మంగళవారం నుంచి ఆయన పనిచేయడం ప్రారంభించారు. విజన్ 2047 పేరుతో ప్రారంభమైన ఈ కార్యాలయం ద్వారా ఇకనుంచి చేపట్టవలసిన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించడం జరుగుతుందనీ ఎమ్మెల్యే తెలిపారు.