మాడుగుల శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో జరుగుతున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామివారికి నాగవల్లి, పూర్ణహతి, చక్ర స్నానం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికమంది భక్తులు ముఖ్యంగా మహిళలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు అర్చకుని ఆశీర్వచనం తర్వాత భక్తులందరూ చక్రస్నానం ఆచరించారు.