పాఠశాలల యాజమాన్యం కమిటీ ఎన్నికలకు గురువారం మాడుగుల ఎంఈఓ లు పాండురంగారావు నోటిఫికేషన్ విడుదల చేశారు. మండలంలో మొత్తం 67 పాఠశాలలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 8న ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఈనెల 5వ తేదీ ఉదయం ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు స్వీకరించి మధ్యాహ్నం తుది జాబితా ప్రకటిస్తారు. మండలంలో గల వివిధ సచివాలయాలు పాఠశాలలు గ్రామ పంచాయతీల వద్ద ఈ నోటిఫికేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు