మాడుగుల: రోడ్డు సౌకర్యం కల్పించాలని నిరసన

50చూసినవారు
మాడుగుల: రోడ్డు సౌకర్యం కల్పించాలని నిరసన
మాడుగుల మండలం ఆవురువాడ పంచాయతీ కొండవీటి గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో శనివారం వారంతా ఆకుల టోపీలు పెట్టుకొని అర్థనగ్న ప్రదర్శన చేస్తూ నీటిలో దిగి నిరసన తెలిపారు. మా బతుకులు వాగులో కొట్టుకుపోతున్నాయనీ, కనీసం మా పిల్లల బ్రతుకులు అయినా ఒడ్డుకు చేర్చాలంటూ గిరిజనులు నిరసన తెలియజేశారు. పిల్లలు చదవాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

సంబంధిత పోస్ట్