మాడుగుల మండల వెలుగు ఏపీఎంగా గొన్నా బత్తుల రమణి కుమారి నియామకం అయ్యారు. ఈమె అనకాపల్లి డీఆర్డిఏ కార్యాలయం నుంచి ఇక్కడికి ఏపీఎంగా బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ ఏపీఎంగా పనిచేస్తున్న అప్పల నరసమ్మ కోటవురట్ల మండలానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ మండలంలో గ్రూపుల బలోపేతానికి, ఆదాయ వనరులు పెంచేందుకు, ముఖ్యంగా మహిళ మార్ట్ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.