చీడికాడ మండలం జైతవరం గ్రామంలో జరుగుతున్న 21వ పశు గణన కార్యక్రమాన్ని శుక్రవారం మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. వి.చిట్టి నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించిన ఆయన మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి 28వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో ఈ పశు గణన జరుగుతుందన్నారు. కాబట్టి ప్రజలు తమ పశు సంపద వివరాలు, పశు సంవర్ధక శాఖ సిబ్బందికి అందించి సహకరించాలని సూచించారు.