జగన్నాథ్ స్వామివారి రథోత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం మాడుగులలో మారు రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుభద్ర బలభద్రుని సహిత శ్రీ జగన్నాథ స్వామివారిని ఇంద్రజిమనం నుంచి ఆలయానికి రథంలో ఊరేగింపుగా తీసుకువచ్చి చేర్చారు. 10 రోజులు పాటు స్వామివారు దశావతారాలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఏకాదశి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.