సింధూర ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో బిజెపి దేశ వ్యాప్త పిలుపుమేరకు శనివారం సాయంత్రం మాడుగులలో బిజెపి ఆధ్వర్యంలో తిరంగ యాత్ర రాలి నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద జాతీయ పతాకాన్ని చేత పట్టుకొని పురవీధుల్లో పార్టీ కార్యకర్తలు యువకులు ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దేశమంతా సైన్యం వెనకే ఉందంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో తిరంగా సమావేశం నిర్వహించారు.