అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ఉదయం వాడవాడల డెమో యోగా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. మాడుగుల మండలంలో గల అన్ని సచివాలయాల్లోనూ ప్రజల భాగస్వామ్యంతో వివిధ రకాల యోగాసనాలు వేయించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కే రమాదేవి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. వీరవిల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎండీఓ కే. అప్పారావు పాల్గొన్నారు.