తిరుమల అంశంపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని హోం మంత్రి అనిత తెలిపారు. ఇటువంటి అబద్దపు ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశముందని ఆమె హెచ్చరించారు. TTD ఛైర్మన్‌గా పనిచేసిన ఓ వ్యక్తి గోశాల అంశంపై తప్పుడు ప్రచారం చేసి, తిరుమల పవిత్రతను చెడగొట్టే ప్రయత్నం చేశారని, చర్యలు తీసుకుంటామని ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో ఎలాంటి వాస్తవాలు లేవని TTD EO శ్యామలరావు స్వయంగా స్పష్టం చేశారని అనిత పేర్కొన్నారు.