అనకాపల్లి: రావణాపల్లి రిజర్వాయర్ కాలువ పనులు ప్రారంభం

67చూసినవారు
అనకాపల్లి: రావణాపల్లి రిజర్వాయర్ కాలువ పనులు ప్రారంభం
అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో రావణాపల్లి రిజర్వాయర్ కాలువ పనులు శనివారం ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభానికి ఏపీ స్పీకర్ తనయులు మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు పాల్గొని పనులను ప్రారంభించారు. రాజేష్ మాట్లాడుతూ రావణపల్లి రిజర్వాయర్ నుండి ఆయకట్టు పొలాలకు వెళ్లే పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్లు, కాలువ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్