నర్సీపట్నం మండలంలోని చెట్టుపల్లి నుంచి జూన్ 21న ప్రధాని మోదీ సమక్షంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 మంది వెళ్లనున్నట్లు సర్పంచ్ జి. సూరిబాబు, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఊడి చక్రవర్తి తెలిపారు. అందరూ రిజిస్ట్రేషన్ పూర్తిచేశారని చెప్పారు. శనివారం గ్రామ సచివాలయం వద్ద ప్రోటోకాల్ యోగా ప్రదర్శన నిర్వహించి, పాల్గొనేవారికి శిక్షణ ఇచ్చారు.