గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లూరి పార్కు వద్ద కారులో తరలిస్తున్న 25 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రేవతమ్మ తెలిపారు. కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసే ఉన్నారు వారి వద్ద నుంచి రూ. 11, 06, 000 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై తారకేశ్వరరావు పాల్గొన్నారు.