పశుగ్రాసంతో అధిక పాల దిగుబడులు

52చూసినవారు
పశుగ్రాసంతో అధిక పాల దిగుబడులు
పశుగ్రాస వారోత్సవాల్లో భాగంగా కృష్ణదేవిపేట పశువైద్యురాలు డాక్టర్ శిరీష మంగళవారం ఏఎల్ పురంలోని పశుగ్రాసాల సాగు భూములను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశుగ్రాసాల వలన పశువులకు అన్ని రకాల పోషకాలు అంది ఆరోగ్యంగా ఎదుగుతాయని చెప్పారు. తద్వారా రైతులు అధిక పాల ఉత్పత్తిని పొందవచ్చునని వివరించారు. పశుగ్రాస విత్తనాలు 75 శాతం సబ్సిడీతో రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్