నర్సీపట్నం: శివాలయంలో ఆకాశదీపం

61చూసినవారు
నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామం శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆకాశదీపం ఏర్పాటు చేశారు. ఆకాశ దీపాన్ని తిలకించిన భక్తులు పూజలో పాల్గొన్నారు. ఆకాశదీప పూజలో పాల్గొంటే ఈశ్వరుని అనుగ్రహం ఉంటుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. కార్తీకమాసం ముగింపు సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్