నర్సీపట్నం: భూముల కొనుగోలుపై విచారణ జరపాలి

71చూసినవారు
జగనన్న కాలనీకి సేకరించిన భూముల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరపాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ నియోజకవర్గంలో తన అనుచరులతో రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించి లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్