నర్సీపట్నం మండలం వేములపూడి ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంధ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బిసి ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ. 200 ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 150 రూపాయలు చెల్లించాలన్నారు. మే నెల 22 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.