సీఐటీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ సిహెచ్. నర్సింహరావు బుధవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని నర్సీపట్నంలో గల స్పీకర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా విశాఖ డైరీ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆయన స్పీకర్ కి వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.