నాతవరం మండలంలో లాటరైట్ పేరు మీద అక్రమ బాక్సైట్ తవ్వకాలతో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రూ.2000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ బుధవారం ఆరోపించారు. టిడిపి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ తవ్వకాలు అంటూ ఆందోళన చేసిన స్పీకర్ అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు వెంటనే వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.