నర్సీపట్నం: వైభవంగా రథోత్సవం

73చూసినవారు
నర్సీపట్నంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తాడికొండ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాట బృంద సభ్యులు చేసిన నృత్యాలు, గోవింద నామాలతో పురవీధులు మారుమ్రుగయ్యి.మారుమ్రుగయ్యాయి. స్వామివారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్