నర్సీపట్నం: తీరు మార్చుకోకపోతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం

75చూసినవారు
నర్సీపట్నం: తీరు మార్చుకోకపోతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం
సారా తయారీదారులు, అమ్మకందార్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ కె సునీల్ కుమార్ హెచ్చరించారు. బుధవారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ సారా తయారీ విక్రయ దారులను గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. పలువురుపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. సారా తయారీ విక్రయాలు రవాణా చేసేవారు ఇకనుంచి స్వస్తి పలకాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్