నర్సీపట్నం: దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం

71చూసినవారు
నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో భీష్మా ఏకాదశి పురస్కరించుకుని శనివారం రాత్రి నిర్వహించిన లక్ష దీపోత్సవం ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేదీప్యమానంగా జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి ఆకారం చుట్టూ అక్షరాల లక్ష దీపాలను మహిళా భక్తులు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో వెలిగించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పద్మవతి మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్