రైతుల వ్యవసాయ అభివృద్ధికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలలో భాగంగా, నర్సీపట్నం మార్కెట్ యార్డ్‌లో జూలై 11న ఉదయం 10 గంటలకు ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రైతులకు అవసరమైన ఆధునిక పరికరాలు, యంత్రాలు గురించి అవగాహన కల్పిస్తారన్నారు.