నర్సీపట్నం: వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు

52చూసినవారు
నర్సీపట్నం: వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
నర్సీపట్నం పెద్ద చెరువు ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో శుక్రవారం రాష్ట్ర వాటర్ స్పోర్ట్స్ అధ్యక్షుడు బలరాం నాయుడు పెద్ద చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ద చెరువులో వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో నిధులు మంజూరు అవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్