ఎంసెట్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నర్సీపట్నంలోని స్థానిక ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల నుండి ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో కె. శివకుమార్ 2561 ర్యాంక్, శ్రీ మనోజ్ఞ 8033 ర్యాంక్, బి. సాయి లక్ష్మి దీప్తి 10716 ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా స్పీకర్ విద్యార్థులను కొనియాడారు.