నర్సీపట్నం: పెండింగ్ చలాన్లపై స్పెషల్ డ్రైవ్

67చూసినవారు
నర్సీపట్నంలో బుధవారం సాయంత్రం ట్రైనీ డీఎస్పి చైతన్య ఆధ్వర్యంలో పెండింగ్ చలాన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అన్ని రకాల వాహనాల తనిఖీలను చేపట్టామన్నారు. గత కొద్ది కాలంగా చలానాలను కట్టకుండా తిరుగుతున్న వాహన చోదకుల రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ చలానాలను వసూలు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్