నాతవరం మండలం జిల్లేడుపూడిలో శుక్రవారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీఎల్ డీఏఈవో ప్రసాదరావు మాట్లాడుతూ. పాడి రైతులు ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. అనంతరం పశువులకు ఇంజక్షన్లు వేశారు. సర్పంచ్ లాలం రమణ, పశు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.