వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునే స్వామి వారికి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉదయం నుంచే స్వామి వారిని భక్తులు భారీగా దర్శించుకోవడానికి భారీ ఎత్తున క్యూకట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం శ్రీ వెంకటేశ్వరయనమః అంటూ మారుమ్రోగింది.