సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

58చూసినవారు
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం పంచాయతీ డొంకాడ గ్రామంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బుద్ధ ధనుంజయ, డా. మధుసూధనరావు హెచ్చరించారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ దోమల నివారణతో సగం రోగాలు నయమవుతాయని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్