లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీకి అవకాశం

75చూసినవారు
నర్సీపట్నం న్యాయస్థానంలో శనివారం లోక్ అదాలత్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్, అడిషనల్ జూనియర్ జడ్జి మధుసూదన్ రావు మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చునని అన్నారు. కక్షిదారులకు విలువైన కాలం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. అనంతరం సివిల్ క్రిమినల్ కేసులలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. పరిష్కార వేదికలో లాయర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్