గొలుగొండ మండలంలోని కసిమి గ్రామంలో చీడిగుమ్మల పీహెచ్సీ వైద్యాధికారి ధనుంజయ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. కావున అందరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.