ఆలయంలో ప్రత్యేక పూజలు

55చూసినవారు
నర్సీపట్నం ఐదు రోడ్ల జంక్షన్ లో గల శ్రీబాల వినాయకస్వామి ఆలయంలో ఆషాడ మాసం పంచమి బుధవారం పురస్కరించుకొని వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కొరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేశ్వరరావు అభిషేకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్ఛార్జ్ ఈవో దివ్య తేజ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్