అక్కయ్యపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ, కుంచాలమ్మ, భూలోకమ్మ మహోత్సవాలు ఈ నెల 17న ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ నెల 3న భూలోకమ్మకు పసుపు కుంకుమలు సమర్పించగా, 10న కుంచాలమ్మ పండుగ నిర్వహించనున్నారు. 16న తొలెళ్ళు పండుగ, 24న 5000 మందికి అన్నసంతర్పణ ఉంటుంది. సంఘ అధ్యక్షుడు అప్పలరాజు వివరించారు.