అల్లూరి: ఏవోబీలో హై అలర్ట్.. బస్సులు బంద్

82చూసినవారు
అల్లూరి: ఏవోబీలో హై అలర్ట్.. బస్సులు బంద్
ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. అగ్రనాయకుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ  మంగళవారం దేశవ్యాప్త బంద్ చేపట్టారు. దీంతో ఏవోబీలో హై అలర్ట్ ప్రకటించగా ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ ముమ్మరంగా చేపట్టాయి. బంద్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసుల నిలిపివేశారు. విశాఖ - భద్రాచలం నైట్ సర్వీసులు కూడా నిలిపివేశారు. మావోయిస్టులు ఆగస్టు 3 వరకూ స్మారక సభలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్