విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని బుల్లయ్య కళాశాల వద్ద అన్న క్యాంటీన్ ను ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడిపి జిల్లా అధ్యక్షుడు
గండి బాబ్జి శనివారం ప్రారంభించారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భరత్ పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం స్వయంగా ప్రజలకు ఆయన ఆహార పదార్థాలను వడ్డించారు. అన్నా క్యాంటీన్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.