ప్రజానాట్యమండలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో నిర్వహించిన కళాకారుల ర్యాలీని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి ఆదివారం ప్రారంభించారు. ఈ ఊరేగింపులో విశాఖ జిల్లా నలుమూలల నుంచి డప్పులు, తీన్మార్లు, కోలాటాలు, డాన్సులతో హోరెత్తించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.