విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో మంగళవారం నేషనల్ ఫైర్ సర్వీస్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అగ్నిప్రమాదాలలో ప్రాణత్యాగం చేసిన వీర ఫైర్‌మెన్‌కు స్మారక చిహ్నంగా, శిలాఫలకానికి చైర్ పర్సన్ డా. ఎం. అంగముత్తు పుష్పాంజలి ఘటించి, పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్విప్‌మెంట్ మరియు ఫోటో ప్రదర్శనలను చైర్ పర్సన్ తిలకించారు. అనంతరం వారోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.