సీతమ్మధార సత్యం జంక్షన్ సిగ్నల్ వద్ద తల్లి జిరాఫీతో పాటు రెండు చిన్న జిరాఫీల బొమ్మలు వేశారు. ఇవి వాహనదారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జంక్షన్ వద్ద రాకపోకల మధ్య ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా జీవీఎంసీ అధికారులు యోగాంధ్ర పథకంలో భాగంగా ఇలాంటి చిత్రాలు, బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు.