కొమ్మాదిలో శనివారం ఉదయం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిగ్నల్ పాయింట్ నుంచి మధురవాడ, మారికవలస వరకు వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఇతర పనులకెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అన్ని రహదారుల్లో వాహనాలు నిలిచిపోవడంతో దారి లేక వాహనదారులు ఇబ్బంది పడ్డారు.