భీమునిపట్నం మండలం కాపులుప్పాడ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ నిర్వహణ పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు కాపులుప్పాడ, గ్రే హౌండ్స్, ఉడా లే అవుట్, చేపల తిమ్మాపురం, గొల్లల తిమ్మాపురం, చిన్న మంగమారిపేట, రెడ్డిపాలెం, నగరపాలెం, కాపుల దిబ్బడిపాలెం వంటి ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు.