విశాఖపట్నం కేంద్ర కరాగరంలో అనుమానాస్పద ప్రదేశాల్లో జరిపిన తవ్వకాలలో రెండు సాధారణ ఫోన్లు లభ్యమైనట్లు సూపరిండెంట్ మహేష్ బాబు గురువారం తెలిపారు. ఈ ఫోన్లు 2024 అక్టోబర్ నెలలో పాతి పెట్టి ఉండవచ్చు అని అనుమానిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక ఆరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఒక్క సెల్ ఫోన్ కూడా వినియోగించకుండా చర్యలు చేపట్టామన్నారు.