ఆపరేషన్ సింధూర్ వేడుకల్లో భాగంగా భారతదేశంలోని అనేక రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా రంగులతో (త్రివర్ణాలతో) రెపరెపలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖరైల్వే స్టేషన్ మంగళవారం రాత్రి విద్యుత్ వెలుగులు, జాతీయ జెండాలతో కళకళలాడింది. భారతీయుల ఐక్యత చాటుకోవడానికి, దేశభక్తి గర్వాన్ని ప్రదర్శించడానికి ఇదో వేదిక మాత్రమేనని రైల్వే అధికారులు తెలిపారు.