ఉమ్మడి విశాఖలో 12 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెందుర్తి, ములగాడ, గాజువాక, సీతమ్మధార, అనందపురం, అచ్యుతాపురం ఎమ్మార్వోలతో పాటు అనకాపల్లి కలెక్టరేట్లో సూపరింటెండెంట్‌కి, అల్లూరి జిల్లాలో మరో ఐదుగురికి బదిలీలు జరిగాయి. వెంటనే వారిని రిలీవ్ చేయాలని అధికారులను ఆదేశించారు.