పరవాడ ఫార్మాసిటీలో ఠాగూర్ లాబరేటరీలో ఆదివారం రాత్రి జరిగిన విష వాయువులు పీల్చడం వలన సింహాచలం అనే కాంటాక్ట్ కార్మికుడు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై సమగ్ర విచారణ చేసి సింహాచలం కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పరిశ్రమ గేటు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు.