గోపాలపట్నం బ్రహ్మపుర-విశాఖపట్నం పాసింజర్ రైలు శనివారం సింహాచలం వద్ద ఒక గంట ఆలస్యమై, ఆపై ఉత్తర సింహాచలంలో రెండు గంటల పాటు ఆగిపోయింది. రైలు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టాలు దాటి సుమారు రెండు కిలోమీటర్లు నడిచి బి.ఆర్.టి.ఎస్ రోడ్డుకు చేరుకున్నారు. ఎండలో ప్రయాణికుల కష్టాలు తీవ్రంగా ఉన్నాయి.