ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జాతీయ ఆతిథ్య నగరంగా విశాఖ ఎంపికవడంతో, నగరంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య డా. రాజేష్ కోటెచా, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. టి. కృష్ణబాబు నేతృత్వంలో అధికారులు రుషికొండ, ఆర్‌కే బీచ్‌లతో పాటు ఆంధ్ర, గీతం విశ్వవిద్యాలయాలను శుక్రవారం సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.