విశాఖ నగరంలో కూరగాయలు ధరలు రోజురోజుకు పైపైకి పెరుగుతున్నాయి. ఉల్లిపాయలు, టమాటా ధరలు అయితే రోజు వ్యవధిలో కిలోకి ఐదు రూపాయలు పైబడి రైతుబజార్లో పెరిగింది. ఇటీవల కురిసిన విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పంటసాగు దెబ్బతిన్నాయి. అందుకే ధరలు పెరిగాయి అని విశాఖపట్నం సీతంధార రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కొండబాబు ఆదివారం తెలిపారు.