పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 5 నుంచి విశాఖ-అరకు మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు ప్రవేశపెడుతున్నామని వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం కె. సందీప్ శనివారం తెలిపారు. వచ్చే నెల ఐదు నుంచి 15వ తేదీ వరకూ ప్రతిరోజు ఉదయం 8. 30 గంటలకు విశాఖలో బయలుదేరి 11. 30 గంటలకు అరకులోయ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు అదే తేదీల్లో మధ్యాహ్నం 2గంటలకు అరకులోయలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుతుంది.