ప్రతి వార్డులో నిత్యం ఇళ్ల నుంచి వ్యర్థాలను పారిశుధ్య కార్మికులు సేకరించేలా విధులు నిర్వహించాలని విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కార్పొరేటర్ ముక్క శ్రావణితో కలిసి అక్కయ్యపాలెం, చిన్నూరు, ఎన్.జి.జీ.వోస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మౌలిక సదుపాయాలు కల్పన, పారిశుధ్య సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ వెల్లడించారు.