విశాఖ: బాబూ జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళి

123చూసినవారు
విశాఖ: బాబూ జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళి
మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం విశాఖలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. జిల్లా ఎస్. సి విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వై. యస్. ఆర్. సి. పి జిల్లా పార్టీ అధ్యక్షులు కె. కె రాజు, మాజీ శాసనసభ్యులు మళ్ల విజయ ప్రసాద్, పార్టీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.